అంతరాలు
తరం తరం
నిరంతరం అంతరం
చిన్నంతరం పెద్దంతరం
అన్న తరాల అంతరాలు
అవధులు దాటితే
ఆరంభం అంతర్ యుధ్ధం
అంతర్ యుధ్ధాలు చిలికి చివరకు
మహా సంగ్రామాలవుతాయి
యుధ్ధాలు వస్తున్నవి
తరాలు తారతమ్యాలు
వయసు తేడా వలన
మరి, ఈ యుధ్ధాలను
అంతమొందించాలంటే
అవతలి వాని ఆంతర్యం
అర్ధం చేసుకోవాలి
అది మనసు వలన మాత్రం సాధ్యం
అందుకే, మనసుతో చూడు
పరదాలను తొలగించు
సరదాగా రాణించు
జీవితాన్ని ఆస్వాదించు.