Monday, February 13, 2012

అమ్రుతవాణి: "పరివర్తన" డ్రామా

అమ్రుతవాణి: "పరివర్తన" డ్రామా
ఇక్కడ విన౦డి

పార్టు-1




పార్టు-2

అమ్రుతవాణి: "ఆత్మజ్ఞాని" డ్రామా

అమ్రుతవాణి: "ఆత్మజ్ఞాని" డ్రామా
ఇక్కడ విన౦డి
పార్టు-1




పార్టు-2

అమ్రుతవాణి: "హ్రుదయసామ్రాట్ ఏకపాత్ర" డ్రామా

అమ్రుతవాణి: "హ్రుదయసామ్రాట్ ఏకపాత్ర" డ్రామా
ఇక్కడ విన౦డి

అమ్రుతవాణి: "కరుణాసింధు" డ్రామా

అమ్రుతవాణి: "కరుణాసింధు" డ్రామా
ఇక్కడ విన౦డి


అమ్రుతవాణి: "మహానేత మోయిసు కథ" డ్రామా

అమ్రుతవాణి: "మహానేత మోయిసు కథ" డ్రామా

ఇక్కడ విన౦డి

అమ్రుతవాణి: "ధనవంతుడు లాజరు" డ్రామా

అమ్రుతవాణి: "ధనవంతుడు లాజరు" డ్రామా
ఇక్కడ విన౦డి

My browser or system is not supporting Telugu language

My browser or system is not supporting Telugu language.
Just follow the steps and get Telugu correctly in your system or Browser

Method 1:

FireFox

If you are using Firefox Browser or above, then follow these steps:

1)Download Telugu Font from our site Click here to Download .

2)Copy font file in fonts folder in your system. Eg: C:/windows/fonts

3)Refresh your browser.



Internet Explorer

If you are using, Internet Explorer follow these steps:

1) In IE 4, click on "View" Menu and then Click on "Internet Options"
In IE 5.0 and above, click on "Tools" Menu and then Click on "Internet Options"

2)Click on Security button

3)Click on Custom level

You will notice a Settings box with multiple options. Please click against the options as shown below:

  • ActiveX controls and plug-ins: "Enable"
  • Script ActiveX controls marked safe: "Enable"
  • Downloads --> File download: "Enable"
  • Java permission: "Medium safety"
  • Access data sources across domains: "Enable"
  • Submit nonencrypted form data: "Enable"
  • Scripting by Java applets: "Enable"
4) After making the above changes, click on Advanced and enable the following options by clicking on the check boxes:
  • Java console: "Enable"
  • Java JIT compiler: "Enable"
  • Java logging: "Enable"

If you are using an old version of Internet Explorer, then we strongly recommend you to download the latest version of Internet Explorer from Microsoft web site. It is free. Click here to go to Microsoft website.


Method 2:
Windows XP and Windows Vista Users:
If you are not able to read the Telugu content properly please follow the following steps. Go to Control Panel -> Select Regional and Language Options -> Click on the Languages tab -> Select the check box 'Install files for complex scripts and right-to-left languages (Including
Thai)' Telugu Unicode help
Click on OK

Telugu Unicode Help

This will prompt you to insert XP CD. Insert the CD and repeat the process. Allow the system to copy necessary files. Restart the system. Now you will be able to read the Telugu content on IE, FireFox and Opera.


Method 3: (Most famous Method)

Telugu letters are not displaying?

Most of the users are facing the same problem in Telugu font display in windows XP.
To overcome this problem, just follow the few steps given below.

License: Freeware!

Description:

Most of the time, when a new user tries to use Telugu on their system, complains that Telugu typing is not working in few systems; This is the mostly asked support request in OmicronLab. All they make a simple mistake, that is, there system must be configured before they can use Telugu. Hence Telugu (and all East Asian languages) is a "complex script", it is not installed in Windows by default. Users need to install this support manually till Windows Xp (Windows Vista and Windows 7 installs this by default).

All these days we are writing and publishing tutorials about "How to enable Telugu on your system". Here comes a simpler solution - IComplex. Within a simple interface, users can install/uninstall complex script support in their system. Now there is no need to bother with Control Panel>Regional settings, just use IComplex, enjoy the simplicity!

Procedure:

  • Click on the "Install complex scripts"
  • Fonts will be install automatically
  • Restart the computer.
  • Telugu websites will be readable

At a glance:

  • Install Complex Script support (Telugu and all East Asian languages) on your system.
  • Unstall Complex Script support anytime.


Who can be benefited?

  • Any one, who wants to use Telugu Unicode (and all East Asian languages) based software (like Avro Keyboard).
  • Software developers, who develop software for Telugu (and all East Asian languages) and want to let their users a simple method to enable this language.
  • Telugu (and all east Asian languages) web page developers, who can distribute this tool to their visitors so that they can view the site properly.

Requirement: Windows 2000, Xp, 2003 Server, Windows 7

Download: Click here to download

అమ్రుతవాణి: "జ్ఞాన జ్యోతి" డ్రామా

అమ్రుతవాణి: "జ్ఞాన జ్యోతి" డ్రామా
ఇక్కడ విన౦డి

అమ్రుతవాణి:"మేమిద్దరం మాకొక్కరు "డ్రామా

అమ్రుతవాణి:"మేమిద్దరం మాకొక్కరు"డ్రామా

ఇక్కడ విన౦డి




అమ్రుతవాణి:"మౌనధ్వని"డ్రామా

అమ్రుతవాణి:"మౌనధ్వని"డ్రామా
ఇక్కడ విన౦డి


పార్టు-1



పార్టు-2

అమ్రుతవాణి: "మేలుకొలుపు" డ్రామా

అమ్రుతవాణి: "మేలుకొలుపు" డ్రామా
ఇక్కడ విన౦డి

అమ్రుతవాణి:"గుడ్ బై డ్రామా"

అమ్రుతవాణి: "గుడ్ బై డ్రామా"
పార్ట్: 1




పార్ట్: 2

Sunday, February 12, 2012

అమ్రుతవాణి: "జరా భద్ర౦ డ్రామా"

అమ్రుతవాణి: "జరా భద్ర౦ డ్రామా"
ఇక్కడ విన౦డి



అమ్రుతవాణి: "బతుకు బ౦డి డ్రామా"

అమ్రుతవాణి: "బతుకు బ౦డి డ్రామా"
ఇక్కడ విన౦డి


అమ్రుతవాణి: "బాబు కొస౦ డ్రామా"

అమ్రుతవాణి: "బాబు కొస౦ డ్రామా"
ఇక్కడ విన౦డి


సునామిక

కడలిపోటుకు
గుండెపాళి విరిగి
నా అక్షరం ముక్కలై
కన్నీరు కార్చింది


’అల’జడికి
కల చెదిరి
వల ముక్కలై
పడవ చెక్కలయింది
బెస్తల బతుకు భారమయింది


పాదచారులకు
ఉదయపునడకలు
మృత్యుపడకలయ్యాయి


భక్తయాత్రికుల
జీవితయాత్రలే ముగిసాయి


మనిషి చేసే ఆగడాలకు
ఆగలేకేమో ప్రకృతే వికృతించింది


భూమి పొరల సంఘర్షణలో
హోరెత్తిన కడలి
కాటుకు కడతేరిన బతుకులు
శివమెత్తిన గంగ, ఉప్పెనై
వూర్లనే వల్లకాడుగా మార్చింది


జలప్రళయ రుద్రతాండవంలో
నుజ్జునుజ్జు అయిన బ్రతుకులెన్నో...
విధివంచితులై యింకా జీవం ఉండీ
జీవఛ్ఛవంలా బ్రతుకునీడుస్తున్న
బండబారిన నైరాశ్యపు బ్రతుకులెన్నో...


ఆకస్మిక అనామిక బ్రతుకుల్లో
ఆశను చిగురింపచేద్దాం
’సహాయం’ అన్న నీరును పోసి
సునామికా జీవితాలను పుష్పింపచేద్దాం.

శీర్షాసనం

నమ్మాల్సిన అక్షరాల్ని అమ్మేస్తున్నాడు
నమ్మి వచ్చిన ’నారి’ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాడు
పెంచాల్సిన పసికందును పెంటపై పారేస్తున్నాడు
ఆదరించాల్సిన "అమ్మ"ను అవతలకు నెట్టేస్తునాడు
అణచాల్సినా "అణుశక్తి"ని ఆకాశానికెత్తేస్తునాడు
అభిమానించాల్సినా దేశాన్ని అతి దారుణంగా అవమానిస్తున్నాడు


భారతమాత మళ్ళీ బంధింపబడింది
మరో గాంధీ... ఎవరో వచ్చి విముక్తి చేయాల్సి ఉంది


"చెడు" చండశాసనుడై చకచకా రాజ్యమేలుతోంది
"మంచి" సాధుడై మాంద్యగతిని మట్టి కఱచుకుపొతోంది
రాబందులకు తెల్లరంగు పూసేసి
అవే శాంతి కపోతాలని ఎగురవేస్తున్నారు
శాంతిపావురాలు చెండాలుడనే వేటగాడి గురి దెబ్బలకు
క్రిందపడి, బురదలో కూరుకుపోతున్నాయి


"నీతి" నియమనిష్టలంటూ మడి కట్టుకూర్చుంది
కప్పలా - బావిలో కప్పలా
"బూతు" బరితెగించి స్వైరవిహారం చేస్తుంది
పక్షిలా - రెక్కలొచ్చిన పక్షిలా
"న్యాయం" నలుగుతోంది నల్లధనం క్రింద
నల్లిలా - నులకమంచంలో నల్లిలా
"అన్యాయం" అందలమెక్కుతోంది అందంగా
రాణిలా - అపరంజి బొమ్మలా
భారతమాత మళ్ళీ బంధింపబడింది
మరో గాంధీ - ఎవరో వచ్చి విముక్తి చేయాల్సి ఉంది


నడాల్సింది ధర్మం నాలుగు పాదాల
నడుస్తూందిప్పుడు అధర్శం ఆరున్నర పాదాల
నడాల్సి ఉంది నరుడు రెండు పాదాల
నడుస్తున్నాడిప్పుడు గురుడు తలక్రిందులుగా


ఎంతసేపు ఈ శీర్షాసనం?



పిలుపు

జగతి ఐక్యతకిది పిలుపు
మానవాళికిది మేలుకొలుపు


మతాన్ని త్రాగిన మత్తులో
ఉన్మాదం తలకెక్కిన మైకంలో
ఉగ్రవృక్షపు ఊడలపై
దయ్యంలా వూగుతూ


ధరణిపై కురుకుతున్న
రాక్షస రక్కసి గుండెల
దారుణ దానవత్వాన్ని
సజీవ సమాధి చేద్దాం


వారి గుండెల్లో ఘనీభవించిన
మానవత్వాన్ని మేల్కొలిపి
చీకట్లను చేధించే నీతి సూర్యునిలా
వెలుగుపూలు వర్షింపచేద్దాం


విశ్వజన కేధారంలో కలంపట్టి
ప్రతియెదనూ దున్నుదాం
దౌర్జన్యపు కలుపును త్రుంచి
గుండె గుండెను మలచుదాం
సమతలు పండిద్దాం
మమతలు పంచుదాం
లోకమంతా ఒక్కటేనని చాటుదాం
విశ్వ-ఐక్య పతాకం ఎగురవేద్దాం


జగతి ఐక్యతకిది పిలుపు
మానవాళికిది మేలుకొలుపు.

నిమజ్జనం

కాష్టం కాలుతుంది
శవం మాత్రం బూడిదవడంలేదు
గంగలో కలిపేదెప్పుడు?
ఆత్మ శాంతించేదెప్పుడు?


కాలుతున్న చీకటి మంటల్లో నుండి
చిమ్ముతున్న రక్తం పైపైకెగసి
లోకమంతా ప్రాకుతుంది
నీడలేవో వెంటాడుతున్నాయి
పీడలేవో పరామర్శిస్తున్నాయి
ప్రేతాత్మలేవో పీడిస్తున్నాయి
చరిత్ర హీనులెవరో
వర్తమానాన్ని వెనక్కి లాగేస్తున్నారు


చిమ్మచీకటి మంటల్లో
వెలుతురు కోసం వెతుకుతున్నారు
తెల్లటి వెలుతురు చినుకులకు
నల్లటి చీకటి గొడుగడ్డం పెట్టి
వెలుతురును ఆస్వాదించలేకపోతున్నారు


పాపం,దీపం
దీపపు వెలుగుకై వెతుకుతోంది
శాపం, తనే వొక దీపం అని
తెలుసుకోలేకపోతోంది.


అవినీతి చీకట్లు ఆకాశాన్నంటక ముందే
జగతి గోడలు చిట్లకముందే
జనత గుండెలు బ్రద్దలవకముందే
భవిత భగ్గుమనకముందే
ఉన్మాదపు కాష్టాన్ని వెలుతురు
చినుకులతో తగలబెడదాం
మతోన్మాదపు బూడిదను
మానస సరోవరంలో కలుపుదాం


అప్పుడే
నీతి సూర్యుని తెజం
మానవత్వపు కాంతిపుంజం
శాంతిసుగంధం వెదజల్లే
వెలుగురేఖల వర్షం
కురిపించే కవి హర్షం.

పెద్దపులి

ప్రకృతి నైజం అంటుంది
ప్రజలను గడగడ వణికిస్తుందొక పులి
.... అది.... చలిపులి.

విశాఖవాసులను హడలెత్తిస్తూ
దారి తప్పి, మానవ కీకారణ్యంలో పడనందుకు
చింతిస్తూ బెంబేలెత్తుతున్నదొక పులి
.... అది.... చిరుతపులి.

"జూ" లో సిబ్బందిని యిబ్బంది పెడ్తూ
యిక్కట్లకు గురిచేస్తున్నదొక పులి
.... అది.... పొగరు పులి.

వీటన్నింటికన్నా భయంకరమైనదొక పులి
.... అది.... పెద్దపులి.

’భారతి’నే చిన్నాభిన్నం చేస్తూ
’భిన్నత్వంలో ఏకత్వం’ అన్న
సిధ్ధాంతాన్నే రాధ్ధాంతం చేసే
రాక్షస రక్కసే ఈ పెద్దపులి
’రజకీయం’ దాని పంజా
’మతోన్మాదం’ దాని కోరలు
’అహం’ దాని అభిమతం

ఆ పెద్దపులి చేసే వథలో
గొఱ్ఱేలనే మైనారిటీల మనోవ్యధ
గుజరాత్ గొర్రెల గుండెకాయల్ని
చీల్చీ చెండాడే రాక్షస రక్కసి
మఠకన్యలను చెరచడం
మతగురువులను నగ్నంగా
నగర నడిబొడ్డున నడిపించడం
విద్యాలయాలను మూయించడం
దేవాలయాలను తగలబెట్టడం
కావా యివి రాక్షస రక్కసి చేసే
వికృత విపరీత చర్యలు.

ఏ కులం?

ఏ కులం ?
ఏకు'లం
'మేకు'లం
కులం
'మరమేకు'లం
మరకలం
'మర'కులం
కార్మికులం
కారకులం
ఉత్పత్తి కారకులం
ఉత్పాదకులం
ఉపయోగకులం
కారకాల్లో నొక కారకులం
శ్రమకారకులం
శ్రామికులం


ఏకులో ఏకునై
మేకులో మేకునై
మరమేకులో మరమేకునై
మరలో మరనై
మానవావయాల మరనై
కారకాల్లో నొక కారకాన్నై
’శ్రమ’కారకినై
శ్రమిస్తాం సహనంతో
కష్టిస్తాం కరములతో
అందిస్తాం అవసరాలను
నిరంతరం నిత్యావసరాలను


శ్రామశక్తిని ధారబోసిన శ్రామికులం
వినియోగదారునికి అవసరాలను
అందించే అర్పకులం
మరి మాకుందా కష్టఫలం?
కనీస అవసరాలను తీర్చే కనీస ఫలం?
శ్రామిక యజ్ఞఫలం?...


చూస్తున్నారుగా ఆకాశాన్నంటుతున్న ధరలు
ఉర్రూతలూగిస్తున్న ధరలు చాలవా?
ఇస్తున్నారా పెరుగుతున్న కరువుకు తగ్గ బతైం
సంవత్సరాని కొకసారిచ్చే బోనస్ ల బుజ్జగింపులు
తీరుస్తుందా కార్మికుల కనీస అవసరాలు


మరి ఈ వస్తు సముదాయానికి
కారకులయిన కార్మికుల
అనుకూలం ప్రతికూలిస్తే
సహనం సన్నగిల్లితే
ఏకు మేకైతే
మరమేకుకు మాటలొస్తే
స్తంభన
కాదా వస్తు స్తంభన
తస్మాత్ జాగ్రత్త.

భిన్నమనస్కులు

కారాగారంలో ఇద్దరు
ఒకడు కన్నీరంటున్నాడు
మరోకడు పన్నీరంటున్నాడు


ఒకడు గతం తాలూకా చేదు
అనుభవాలను తలచుకుంటూ
కిటికీ చువ్వలను గణియింపగ
మరొకడు అదే కారాగారపు
కిటికీ చువ్వల గుండా
భవితవ్యపు తీపిదనాన్ని
ఆయానంద పుష్పపరిమళాన్ని
గగనంలో కనిపించే
చంద్రుని వెన్నెలలో చూస్తున్నాడు


కారాగారంలో ఇద్దరు
ఒకడు కన్నీరంటున్నాడు
మరోకడు పన్నీరంటున్నాడు