Sunday, February 12, 2012

భిన్నమనస్కులు

కారాగారంలో ఇద్దరు
ఒకడు కన్నీరంటున్నాడు
మరోకడు పన్నీరంటున్నాడు


ఒకడు గతం తాలూకా చేదు
అనుభవాలను తలచుకుంటూ
కిటికీ చువ్వలను గణియింపగ
మరొకడు అదే కారాగారపు
కిటికీ చువ్వల గుండా
భవితవ్యపు తీపిదనాన్ని
ఆయానంద పుష్పపరిమళాన్ని
గగనంలో కనిపించే
చంద్రుని వెన్నెలలో చూస్తున్నాడు


కారాగారంలో ఇద్దరు
ఒకడు కన్నీరంటున్నాడు
మరోకడు పన్నీరంటున్నాడు

1 comment:

  1. కన్నీరు-పన్నీరు కాంబినేషన్ చాలా బాగుంది ప్రసాదు గారు.

    ReplyDelete